Top
logo

తాతే తల్లిని చేసాడు. జరిమానా లక్షన్నర కట్టాలని తీర్పు ఇచ్చిన పెద్దలు

తాతే తల్లిని చేసాడు. జరిమానా  లక్షన్నర కట్టాలని తీర్పు ఇచ్చిన పెద్దలు
X
Highlights

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మానవ విలువలు లేకుండా పోయాయి .. కామావాంఛతో వావివరసలు లేకుండా కామంధులు అత్యాచారాలకు...

ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మానవ విలువలు లేకుండా పోయాయి .. కామావాంఛతో వావివరసలు లేకుండా కామంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు .. అందులో భాగంగానే వరుసకు మనవరాలు అయిన ఓ బాలికకు మాయమాటలు చెప్పి పలుసార్లు లొంగ దీసుకున్నాడు ఓ దుర్మార్గుడు . బాలిక గర్భం దాల్చడంతో అసలు విషయం బయటపడింది. విషయం కాస్తా పంచాయితీ పెద్దల దగ్గరికి వెళ్ళడంతో చేసిన తప్పుకు గాను లక్షన్నర రూపాయల జరిమానా విధించాలని ఇచ్చిన తీర్పుకు అసహనానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది .. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది..

ఇక వివరాల్లోకి వెళ్తే మీర్‌పేట ప్రాంతలోని ప్రశాంతినగర్‌కు చెందిన మొగులయ్యకు భార్య పున్నమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2008 లో భార్య చనిపోవడంతో 2009 లో మిర్యాలగూడకు చెందిన దుర్గమ్మను రెండో వివాహం చేసుకున్నాడు . దుర్గమ్మ చెల్లెలైన నాగమ్మ కూడా వారుంటున్న కాలనీలోనే ఉంటోంది. మిర్యాలగూడలో ఉంటున్న వారి మేనమామ మల్లేష్‌ తరచూ నాగమ్మ, దుర్గమ్మల ఇళ్లకు వస్తుండే వాడు. ఈ క్రమంలో మల్లేష్ కన్ను మొగులయ్య రెండో కుమార్తె(17) పై పడింది. ఆమెకు మాయమాటలు చెప్పి చాలా సార్లు లోబర్చుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం బాలిక అస్తమానం కడుపునొప్పితో భాదపడుతుండడంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళారు . చికిత్స అనతరం ఆమె గర్భం దాల్చింది అని తెలిసింది . దీంతో బాలిక తల్లిదండ్రులు ఇదే ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పంచాయితీ అనంతరం మల్లేష్‌ను నష్టపరిహారంగా రూ.లక్షన్నర చెల్లించాలని పెద్దలు సూచించారు. ఇచ్చిన తీర్పుతో మనస్తాపం చెందిన ఆ బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . మల్లేష్ మాత్రం ప్రస్తుతం పరారిలో ఉన్నాడు ..

Next Story