తమిళనాడులో భారీ సెక్స్ రాకెట్...200 మందికి పైగా అమ్మాయిలపై అత్యాచారం

తమిళనాడులో భారీ సెక్స్ రాకెట్...200 మందికి పైగా అమ్మాయిలపై అత్యాచారం
x
Highlights

మానవత్వం మంటగలిసింది. నమ్మినవారే నయవంచనకు తెరతీశారు. ప్రేమపేరుతో వెంటపడి అభం శుభం తెలియని అమ్మాయిల జీవితాలను చిదిమేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు...

మానవత్వం మంటగలిసింది. నమ్మినవారే నయవంచనకు తెరతీశారు. ప్రేమపేరుతో వెంటపడి అభం శుభం తెలియని అమ్మాయిల జీవితాలను చిదిమేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు రెండు వందల మంది యువతులు మాన మార్యాదలతో వ్యాపారం చేయడం సంచలనం రేపుతోంది.

తమిళనాడులో దిగ్భ్రాంతి కలిగించే భారీ సెక్స్ రాకెట్ ఒకటి బయటపడింది. 20 ఏళ్లలోపు అమ్మాయిలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. ప్రేమపేరుతో అమ్మాయిలను వంచించి ఆ పై లైంగిక సంబంధాలు పెట్టుకుని వాటిని వీడియోలు తీసి వాటితో వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ రాకెట్‌ను స్వయంగా అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన యువనేత నడిపించడం దుమారం రేపుతోంది. ఈ ఉచ్చులో సుమారు 200 మందికిపైగా యువతులు, బాలికలు చిక్కుకున్నారు. బాధిత యువతులందరూ కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి పరిసర ప్రాంతాలకు చెందినవారే. ఏడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ రాకెట్ వ్యవహారం బాధితుల ఫిర్యాదుతో బయటకొచ్చింది.

విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొల్లాచ్చికి చెందిన శబరిరాజన్, తిరునావుక్కరసు సతీశ్, వసంతకుమార్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్‌ఫోన్లలో వందలాదిమంది అమ్మాయిల అశ్లీల చిత్రాలు, వీడియోలను చూసి నిర్ఘాంతపోయారు. రెండువందల మందికిపైగా బాధితులు ఉంటారని ఈ వీడియోల ఆధారంగా పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

తొలుత ఫేస్‌బుక్‌ ద్వారా అమ్మాయిలను ట్రాప్‌ చేసి ఆ తర్వాత ప్రేమిస్తున్నామంటూ వెంటపడి శారీరకంగా దగ్గరవుతున్నట్లు నిందితులు తెలిపారు. అంతేకాక ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ దృశ్యాలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అంతంటితో ఆగకుండా ఆ వీడియోలను కుటుంబ సభ్యులతో పాటు సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇలా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు నిందితులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఘటన సంచలనం కావడం, ముఠా సభ్యుడు అధికారపార్టీ నేత కావడంతో రాజకీయ దుమారం రేగింది. అన్నాడీఎంకేపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో స్పందించిన అధికారపార్టీ నాగరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories