విషాదం...11 మంది అయ్యప్ప భక్తుల మృతి

devotes
x
devotes
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన 11 మంది అయ్యప్పభక్తులు ప్రాణాలు కోల్పోయారు. మెదక్‌ జిల్లాకు చెందిన 16 మంది వ్యాన్‌లో శబరి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన 11 మంది అయ్యప్పభక్తులు ప్రాణాలు కోల్పోయారు. మెదక్‌ జిల్లాకు చెందిన 16 మంది వ్యాన్‌లో శబరి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, హత్నూర మండలాల్లోని కాజీపేట, మంతూర్‌, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, మంగాపూర్‌ గ్రామాలకు చెందిన మొత్తం 16 మంది ఓ వ్యాన్‌లో శబరి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. తమిళనాడులో పుదుకొట్టై దగ్గర వీరు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను భారీ కంటైనర్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

మృతిచెందిన వారిలో నాగరాజు, మహేష్, కుమార్, శ్యాం, ప్రవీణ్, కృష్ణ, సాయి, ఆంజనేయులు, సురేష్ తో పాటు వ్యాన్ డ్రైవర్ ఉన్నారు. శ్రీశైలం, భూమా గౌడ్, రాజు, వెంకటేష్ చికిత్స పొందుతున్నారు. మరోవైపు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తమిళనాడు అధికారులను సంప్రదించారు. అలాగే పుదుకొట్టై జిల్లా కలెక్టర్‌తో మెదక్‌ కలెక్టర్‌ మాట్లాడారు.

మరికొన్ని గంటల్లో సొంతూళ్లకు చేరుకోనున్న వారిని మధ్యలోనే మృత్యువు కబలించడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. నర్సాపూర్‌ సీఐ, తహశీల్దార్‌ పుదుకొట్టైకు చేరుకున్నారు. ఇటు తమిళనాడు ప్రభుత్వం మృతులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.





Show Full Article
Print Article
Next Story
More Stories