Registration DIG: భార్య, కొడుకును చితకబాదిన రిజిస్ట్రేషన్స్ డీఐజీ..కేసు నమోదు

Registration DIG: భార్య, కొడుకును చితకబాదిన రిజిస్ట్రేషన్స్ డీఐజీ..కేసు నమోదు
x
Highlights

Registration DIG: ఉన్నత ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వాధికారి వివాహేతర సంబంధంతో భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. ఆమెకు కొట్టడంతో గాయాలపాలైన బాధితురాలు...

Registration DIG: ఉన్నత ఉద్యోగంలో ఉన్న ప్రభుత్వాధికారి వివాహేతర సంబంధంతో భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. ఆమెకు కొట్టడంతో గాయాలపాలైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నెల్లూరులో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణహింసలకు గురి చేసిన ఘటనపై ప్రభుత్వాధికారిపై గుంటూరు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త తనను చితకబాదాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం రాత్రి గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఎల్ఐసీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న అనసూయరాణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పోస్టల్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కిరణ్ అనసూయ దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఏడాది నుంచి వేర్వేరుగా నివసిస్తున్నారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ అనసూయపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె స్ప్రహతప్పి పడిపోయారు. దీంతో స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత బాధితురాలు గుంటూరు అరండల్ పేట పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ గతంలో గుంటూరులో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డీఐజీగా విధులను నిర్వహించారు.

తమది ప్రేమ వివాహమని బాధితురాలు అనసూయ పేర్కొన్నారు. పిల్లలు పుట్టకపోవడంతో ఓపాపను దత్తత తీసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా 2012లో ఓ బాబుకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన భర్త కొన్నేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు. భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక 10 నెలల నుంచి ఇద్దరం వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. తమ కుమార్తె విదేశాల్లో చదువుతుండగా..బాబు తనతోనే ఉంటున్నట్లు ఆమె చెప్పారు. రెండు రోజుల క్రితం బంధువలు ఇంటికి వెళ్తుంటే తమను అడ్డుకుని బాబును, తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై అరండల్ పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories