స్కూల్లో ర్యాగింగ్ భూతం

స్కూల్లో ర్యాగింగ్ భూతం
x
Highlights

హైదరాబాద్ సిటీ సరూర్ నగర్‌లోని నియో రాయల్ స్కూల్‌లో తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక 10వ తరగతి స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా...

హైదరాబాద్ సిటీ సరూర్ నగర్‌లోని నియో రాయల్ స్కూల్‌లో తోటి విద్యార్థుల ర్యాగింగ్ తట్టుకోలేక 10వ తరగతి స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. సరూర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నియో రాయల్ స్కూల్‌లో ర్యాగింగ్‌ తట్టుకోలేక ఓ విద్యార్ధి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తోటి విద్యార్ధులు డబ్బులు తీసుకురావాలని బెదిరించడంతో తల్లిదండ్రులకు తెలియకుండా 6 వేల రూపాయలు ఇచ్చాడు. మళ్లీ మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఓ సుసైడ్ నోట్‌ కూడా రాసి పెట్టాడు. స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో రవికిరణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం రవికిరణ్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories