Top
logo

వెలుగుచూస్తున్న మల్టీలెవెల్ మార్కెటింగ్‌ మోసాలు

QNet FraudQNet Fraud
Highlights

మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ మాయలో పడొద్దని ఒకటికి పది సార్లు చెబుతున్నా అత్యాశకు పోతున్న అమాయక జనం ఆ వలలో చిక్కుకుంటున్నారు. ఆస్తులను అమ్ముకుని కుటుంబాన్ని రోడ్డుకీడ్చుకుంటున్నారు.

మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ మాయలో పడొద్దని ఒకటికి పది సార్లు చెబుతున్నా అత్యాశకు పోతున్న అమాయక జనం ఆ వలలో చిక్కుకుంటున్నారు. ఆస్తులను అమ్ముకుని కుటుంబాన్ని రోడ్డుకీడ్చుకుంటున్నారు. తాజాగా వెలుగుచూసిన క్యూ నెట్‌ మోసాల విలువు ఏకంగా 20 వేల కోట్లకు పైగా ఉందని సైబరాబాద్‌ పోలీసులు లెక్కలు తేల్చారు. తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు క్యూ నెట్‌ వలలో చిక్కుకుని చేతులు కాల్చుకున్నారు.

బ్యాంకులను బురిడీ కొట్టిన నీరవ్‌ మోడీ, విజయ్‌మాల్యాలే అవాక్కయ్యేలా వేలాది మందిని ప్రత్యక్షంగా ముంచిన క్యూ నెట్‌ మోసాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దీని బాధితులు ఒక్క తెలుగురాష్ట్రాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా వేలాది మంది దీని బారిన పడి విలవిల్లాడుతున్నారు. ఈ మల్టీలెవెల్‌ మార్కెటింగ్‌ మోసం విలువ 20 వేల కోట్ల పైమాటే అని సైబరాబాద్‌ పోలీసులు అంచనాకు వచ్చారు. అయితే బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతుండటంతో స్కామ్‌ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో భాదితుల సంఖ్య 20 వేల మందికి పైగా ఉన్నట్లు ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, అమాయకులును టార్గెట్గా చేసుకొన్న సంస్థ మోసాలకి పాల్పడింది. క్వస్ట్, గోల్డ్ నెట్, క్యూ నెట్ సంస్థల పేర్లతో మూడు దఫాలుగా వీరు కంపెనీలు స్థాపించి కోట్లను కొల్లగొట్టారు. ఒక్క తమిళనాడులోనే 4 వేల మంది భాదితులు ఉన్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.

ఇక ఈ సంస్థల వల్ల తీవ్రంగా నష్టపోయామని తెలుసుకున్న ముంబైకి చెందిన గురుప్రీత్ సింగ్, అనుజా అనే ఇద్దరు భాదితులు ఏకంగా ఫైనాన్సియల్ ఫ్రాడ్ విక్టమ్స్ వెల్ఫర్ అసోషియేషన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి సంస్థల వల్ల దేశవ్యాప్తంగా నష్టపోయిన బాధితులందరిని కూడగట్టి న్యాయ పోరాటం చేస్తున్నారు. వీరు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఇలాంటి గొలుసు కట్టు విధానం ద్వారా అనతి కాలంలో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని ఎవరైనా చెప్పినా నమ్మొద్దంటున్నారు పోలీసులు. ఆర్థిక వ్యవహారాల నేరాలు కి సంబందించిన విభాగం ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 60 మందిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేయొచ్చని సీపీ సజ్జనార్‌ తెలిపారు. క్యూ నెట్‌ కు సంబంధించిన ఆస్తులను సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు.


Next Story


లైవ్ టీవి