Top
logo

కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసుకొని..ఆత్మహత్యా యత్నం

కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు వేసుకొని..ఆత్మహత్యా యత్నం
X
Highlights

హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. అంబర్‌పేట్ డీడీ కాలనీలో...

హైదరాబాద్‌లో నివాసముంటున్న ఓ పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. అంబర్‌పేట్ డీడీ కాలనీలో పంజాబ్‌కి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. కూల్ డ్రింక్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని తాగడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అంబర్‌పేట్ పోలీసులు మన్ను, నికల్‌లను హుటాహుటిన ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్‌కి తరలించారు. భార్యాభర్తలు మృతి చెందగా వారి కూతురు, కుమారుడుల పరిస్థితి విషమంగా ఉంది. వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియ రాలేదు.

Next Story