Top
logo

దొంగతనాలు చేసి మరి సినిమాలు చేసాడు...

దొంగతనాలు చేసి మరి సినిమాలు చేసాడు...
X
Highlights

బేసిక్ గా ఇతనో దొంగ ... పెద్దగా చదువుకోలేదు కానీ దొంగతనానికి స్కెచ్ వేసాడు అంటే మాత్రం పక్కాగా...

బేసిక్ గా ఇతనో దొంగ ... పెద్దగా చదువుకోలేదు కానీ దొంగతనానికి స్కెచ్ వేసాడు అంటే మాత్రం పక్కాగా జరిగిపోవాల్సిందే.. అలా దొంగతనాలు చేసి మరి సినిమాలకి ప్రొడక్షన్ చేసాడు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి లలిత జ్యూవెలరి దొంగతనంలో ఇదే ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం బాగానే గాలిస్తున్నారు కూడా . పోలిసుల సమాచారం మేరకు .. ఇతగాడి పేరు మురుగన్... గోడలకి కన్నాలు వేసి దొంగతనాలు చేయడంలో ఇతడి రూటే సపరేటు.. ఎప్పటికైనా సరే కోటీశ్వరుడు కావలని చేయని దొంగతనాలు లేవు..

18 ఏళ్ల వయసుకే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. అయితే ఇతనికి దొంగతనంతో పాటు సినిమా అంటే పిచ్చి కూడా ఉంది. దొంగతనాలు చేసిన డబ్బుతో సినిమాలు చేయాలనీ అనుకున్నాడు. వెంటనే తన మాకం హైదరబాద్ కి మార్చి 'బాలమురుగున్' ప్రొడక్షన్ పేరిట ఓ నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసాడు. అందులో భాగంగానే ' మనసా వినవే', ఆత్మ సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.

ఇక ఇతడిపై పలు కేసులు నమోదు కావడంతో పోలీసులు కూడా ఇతగాడి కోసం కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం ఏమి బాగులేదని ఓ వ్యాన్ లో సంచార జీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు చెబుతున్నారు.

Next Story