Top
logo

శ్రీధరణిని హతమార్చింది ప్రేమికుడేనా?

శ్రీధరణిని హతమార్చింది ప్రేమికుడేనా?
X
Highlights

పశ్చిమగోదావరి జిల్లా జీలకర్రగూడెంలో ప్రేమ జంటపై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అయితే, శ్రీధరణి...

పశ్చిమగోదావరి జిల్లా జీలకర్రగూడెంలో ప్రేమ జంటపై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అయితే, శ్రీధరణి మృతిపై నవీన్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. మొదట శ్రీధరణి ఎవరో తనకు తెలీదన్న నవీన్‌ ఆ తరువాత ఇద్దరూ కలిసి కొండపైకి వెళ్లామని, అక్కడ తమపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని చెప్పాడు. నిమిషానికో మాట మార్చుతుండడంతో అసలు నిజాలు బయటకు రావడంలేదు. దీంతో అతనిపైనే పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవీన్‌ తలవెనుక భాగంలో బలమైన గాయలు అయినట్లు వైద్యలు వెల్లడించారు. కాగా హత్యకు గురైన శ్రీధరణికి మార్చి9న దగ్గరి బందువు అబ్బాయితో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. యువతి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు, నవీన్ ను ఎప్పుడూ చూడలేదని అతనెవరో తెలియదంటున్న శ్రీధరణి తల్లిదండ్రులు అంటున్నారు.

Next Story