Top
logo

మీరు ఓఎల్ ఎక్స్ యాప్ లో కెమెరా అద్దెకు పెట్టారా..?..అయితే జాగ్రత్త !

మీరు ఓఎల్ ఎక్స్ యాప్ లో కెమెరా అద్దెకు పెట్టారా..?..అయితే జాగ్రత్త !
X
Highlights

మీరు ఓఎల్ ఎక్స్ యాప్ లో కెమెరా అద్దెకు పెట్టారా..? ఎక్కువ మంది చూస్తారు ఆదాయం బాగానే వస్తుందని ఆశపడుతున్నారా...

మీరు ఓఎల్ ఎక్స్ యాప్ లో కెమెరా అద్దెకు పెట్టారా..? ఎక్కువ మంది చూస్తారు ఆదాయం బాగానే వస్తుందని ఆశపడుతున్నారా అయితే ఇక మీరు మీ కెమెరాపై ఆశలు వదలుకోవాల్సిందే. ఆదేంటి అనుకుంటున్నారా..? ఓఎల్ఎక్స్ వినియోగదారులే టార్గెట్ గా ఓ ముఠా రంగంలోకి దిగింది. మాయ మాటలు చెప్పి అద్దెకు తీసుకున్న కెమెరాలతో పరారవుతున్నారు. ఆన్ లైన్ అడ్డాగా మోసాలకు పాల్పడుతున్న ఓఎల్ఎక్స్ చీటింగ్ ముఠాకు చెక్ పెట్టారు ఏలూరు పోలీసులు.

సులువుగా డబ్బులు సంపాధించాలన్న ఆలోచన వారిని కటకటాల పాల్జేసింది. ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా కెమెరాలు అద్దెకు ఇచ్చే వారి సమాచారం తెలుసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ, కృష్ణా జిల్లాలే టార్గెట్ గా ఆన్ లైన్ చీటింగ్ కు తెరలేపారు. నలుగురు బృందంగా ఏర్పడిన వీరు ఓఎల్ఎక్స్ లో పెట్టె కెమెరాలను టార్గెట్ గా దందా మొదలు పెట్టారు. నకిలీ ఆదార్ కార్డులు గుర్తింపు కార్డులుగా ఇచ్చి కెమెరాలు తీసుకెళ్లి సెల్ ఫోన్ స్విచ్చాప్ చేసేవారు. ఆ తర్వాత మరో నకిలీ ఆధార్ కార్డుతో కొత్త మొబైల్ సిమ్ తీసుకుని కెమెరాలు అద్దెకు తీసుకుని పరారవుతుండే వారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లో దాదాపు 28 కెమెరాలు దోచుకున్నారు. అంతే కాదు కాకినాడలోని ఓ ట్రావెల్స్ నంచి కారు అద్దెకు తీసుకుని ఉడాయించారు.

ఓఎల్ ఎక్స్ టార్గెట్ గా కెమెరాలు దోచుకుంటున్న ముఠాను పశ్చిమగోదావరి పోలీసులు చేధించారు. ఏలూరు సమీపంలోని బైపాస్ రోడ్డు సమీపంలో నిఘా పెట్టారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ఢిక్కీలో 28 కెమరాల బయటపడ్డాయి. అనుమానం వచ్చిన పోలీసులు కారులో ఉన్నవారిని విచారించడంతో గుట్టురట్టయ్యింది.

రాజమండ్రికి చెందిన గోపీ, ముమ్మిడి వరానికి చెందిన పలివెల శ్రీనివాస్, అఖిల్ తో పాటు రాజమహేంద్రవరంలో తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించి వీరికి సహకరిస్తున్న గారుశెట్టి శివకమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 25 లక్షల విలువైన కెమెరాలు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు.

Next Story