అమాయకత్వమే స్రవంతి ప్రాణం తీసిందా?

అమాయకత్వమే స్రవంతి ప్రాణం తీసిందా?
x
అరుణ్‌
Highlights

అమాయకత్వం అపాయం ఎరుగని నమ్మకం నిండు ప్రాణం బలితీసుకుంది. భర్తను కాపాడుకోవాలనే ఆశ పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలనే కోరిక ఆమెను అనంత లోకాలకు...

అమాయకత్వం అపాయం ఎరుగని నమ్మకం నిండు ప్రాణం బలితీసుకుంది. భర్తను కాపాడుకోవాలనే ఆశ పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేయాలనే కోరిక ఆమెను అనంత లోకాలకు తీసుకుపోయింది. నిజామాబాద్ జిల్లా వినాయకనగర్‌కు చెందిన స్రవంతి మర్డర్ మిస్టరీ వీడింది. ఈ నెల 5 న ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్రవంతి చివరకు దారుణ హత్యకు గురైంది. దీంతో తల్లిదండ్రులు దూరం కావడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.

నిజామాబాద్‌కు చెందిన బ్యుటీషియన్ స్రవంతి మర్డర్ కేసు మిస్టరీ వీడింది. జైల్లో ఉన్న భర్తను బయటకు తీసుకొస్తానంటూ నమ్మించిన వ్యక్తే అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లా వినాయకనగర్‌కు చెందిన బ్యూటీపార్లర్ నడుపుతున్న స్రవంతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. ఆమె భర్త రాజు ఓ కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో అతన్ని ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు ఆమె అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న డిచ్‌పల్లి మండలం సుద్దపల్లికి చెందిన అరుణ్‌ స్రవంతితో పరిచయం పెంచుకున్నాడు. అప్పటికే పలు చోరీ కేసుల్లో జైలుకెళ్లొచ్చిన అరుణ్‌ జైలు నుంచి ఎవరైనా బయటకు తీసుకురావాలంటే డబ్బులు ఉండాలని ఆమెకు తెలిపాడు. తాను గతంలో చోరీ చేసిన సొత్తును ఓ ప్రాంతంలో దాచిపెట్టానని వస్తే ఇద్దరం పంచుకుందామని స్రవంతిని అరుణ్‌ నమ్మించాడు.

తన భర్తను ఎలాగైనా బయటకు తీసుకురావాలనే ఆశతో అమాయకంగా అరుణ్‌ను నమ్మింది స్రవంతి. దీంతో ఈ నెల 5 న ఇంటి నుంచి బయల్దేరుతూ మధ్యలో స్కూళ్లో చదువుతున్న ఇద్దరు బిడ్డలకు టిఫిన్ బాక్సులు అందించింది. ఆ తర్వాత అరుణ్‌ను కలిసేందుకు స్కూటీపై వెళ్లింది. మొదట డిచ్‌పల్లి దగ్గరకు అరుణ్‌ను కలిసిన స్రవంతి ఇద్దరూ కలిసి రామాయంపేటలోని కొత్తచెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడే ఆమెను అత్యాచారం చేసిన అరుణ్ ఆ తర్వాత హత్య చేశాడు. మృతదేహాన్ని చెరువులోనే వదిలేశాడు.

విచారణలో అరుణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు స్రవంతి మర్డర్ మిస్టరీని ఛేదించారు. ఇటు తల్లి మరణించడం అటు తండ్రి జైల్లో ఉండటంతో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మిగిలారు. టిఫిన్ బాక్సులిచ్చినప్పుడు కనిపించిన అమ్మ మళ్లీ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. అమ్మ గురించి అడిగితే ఊరికెళ్లిందంటూ అమాయకంగా చెబుతున్నారు. వచ్చీ రాని మాటలతో అమ్మ వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. తల్లిదండ్రులు దూరం కావడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లుతున్నాయి. అమ్మ కావాలంటూ చిన్నారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories