పార్సిల్ డెలివరీ బాయ్ దారుణం... హిప్నొటైజ్ చేసి....

పార్సిల్  డెలివరీ బాయ్ దారుణం... హిప్నొటైజ్ చేసి....
x
Highlights

ఓ అమెజాన్ డెలివరీ బాయ్ దారుణానికి దిగాబోయాడు.. ఒంటరిగా ఉన్న మహిళపై హిప్నొటైజ్ చేసి అత్యాచారం చేయబోయాడు. కానీ మహిళ సృహలోకి రావడంతో గండం గట్టేకింది ఈ...

ఓ అమెజాన్ డెలివరీ బాయ్ దారుణానికి దిగాబోయాడు.. ఒంటరిగా ఉన్న మహిళపై హిప్నొటైజ్ చేసి అత్యాచారం చేయబోయాడు. కానీ మహిళ సృహలోకి రావడంతో గండం గట్టేకింది ఈ ఘటన నోయిడాలో సోమవారం (అక్టోబర్ 7)న చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే బాధితురాలు అమెజాన్ లో మొత్తం అయిదు వస్తువులకు గాను ఆర్డర్ ఇచ్చింది. అందులో భాగంగా వస్తువులు నచ్చకపోవడంతో వాటిని తిరిగి ఇచ్చేయాలని అనుకుంది. అమెజాన్ కస్టమర్ కేర్‌కు డయల్ చేసి ఆ విషయాన్ని చెప్పింది. వారు కూడా వాటిని తీసుకువెళ్ళడానికి ఓ డెలివరీ బాయ్ ని ఆమె ఇంటికి పంపారు. అతడు భాదితురాలు అపార్ట్ మెంట్ కి వచ్చే ముందు అక్కడి రిజిస్టర్‌లో తన పేరును భూపేందర్ పాల్‌ (30)గా ఎంట్రీ చేశాడు.

భాదితురాలు వస్తువులను తిరిగి ఇచ్చే క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేను నాలుగు వస్తువులను మాత్రమే తీసుకువెళ్తానని లేని పక్షంలో కంపెనీ నుండి మాట వస్తుందని సదరు డెలివరీ బాయ్ ఆమె పైకి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో భాదితురాలు తిరిగి అమెజాన్ కస్టమర్ కేర్‌కు డయల్ చేసి ఆ విషయాన్ని చెప్పింది.దీనితో వారు మరో డెలివరీ బాయ్ ని పంపిస్తామని చెప్పడంతో అక్కడి నుండి అతడు వెళ్ళిపోయాడు. కొద్ది సమయం తర్వాత తిరిగి వచ్చి భాదితురాలును ఇబ్బంది పెట్టాడు..

ఇలా జరుగుతున్న క్రమంలోనే భాదితురాలు కళ్ళు తిరిగి పడిపోయింది. తీరా కళ్ళు తెరిచే సమయానికి ఆమెపై డెలివరీ బాయ్ అత్యాచారం చేయబోయాడు. భాదితురాలు కేకలు వేయడంతో అక్కడి నుండి ఆతను పారిపోయాడు. అనంతరం తన చెల్లెలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ.. ఆ ఫిర్యాదులో అమెజాన్ డెలివరీ బాయ్ తనను హిప్నొటైజ్ చేసి అత్యాచారం చేయబోయాడని పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories