రిసార్ట్ కాదు డెత్‌స్పాట్

Arun Chilukuri
Published on: 4 July 2019 2:45 PM IST
రిసార్ట్ కాదు డెత్‌స్పాట్
X

వికారాబాద్ జిల్లాలో ఎటువంటి పోలీసుల పర్యవేక్షణా లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రిసార్ట్‌లు డెత్ స్పాటుల్లా మారుతున్నాయి. ఎటువంటి సెఫ్టీ ప్రికాషన్ష్ తీసుకోకుండా నిర్వహిస్తున్న అడ్వంచర్ గేమ్స్‌తో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఏటీవీ ఫోర్ వీలర్‌ రైడింగ్ చేస్తూ ఓ ఎన్ఆర్‌ఐ ప్రమాదవశాత్తూ చనిపోయాడు.

అమెరికాలోని డల్లాస్‌లో ఉంటోన్న గ్రీన్ కార్డు హోల్డర్ అరవింద్ పిచాయ్ వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం గోధుమగూడా గ్రామంలోని ఓ రిసార్ట్స్‌లో బస చేశారు. అడ్వైంచర్ గేమ్స్‌లో భాగంగా ఏటీవీ ఫోర్ వీలర్‌ రైడింగ్ చేస్తుండగా అది బోల్తా పడి అరవింద్ చనిపోయాడు. అయితే రిసార్ట్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే అరవింద్ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story