Top
logo

మంగళగిరి జ్యోతి మర్డర్ కేసులో కొత్త కోణం

మంగళగిరి జ్యోతి మర్డర్ కేసులో కొత్త కోణం
X
Highlights

మంగళగిరి జ్యోతి మర్డర్ కేసులో కొత్త కోణం బయటికొచ్చింది. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని చంపినట్లు పోలీసులు...

మంగళగిరి జ్యోతి మర్డర్ కేసులో కొత్త కోణం బయటికొచ్చింది. ప్రియుడు శ్రీనివాసే జ్యోతిని చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రేమ పేరుతో జ్యోతిని నమ్మించి శ్రీనివాస్‌ మోసం చేసినట్లు గుర్తించారు. పెళ్లి చేసుకోమని జ్యోతి గట్టిగా నిలదీయడంతోనే హత్య చేసినట్లు దర్యాప్తులో తేల్చారు. కేసు నుంచి తప్పించుకోవడానికే దాడి డ్రామా ఆడినట్లు భావిస్తున్న పోలీసులు జ్యోతి హత్యకు ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్నట్లు గుర్తించారు. దాంతో ఆ ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. జ్యోతిలాగే మరికొందరు యువతులను ట్రాప్‌ చేసిన శ్రీనివాస్‌ నగ్న వీడియోలు తీసినట్లు గుర్తించారు. జ్యోతిని హత్య చేసిన ప్రదేశంలోనే నగ్న వీడియోల చిత్రీకరణ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Next Story