పార్శిల్ డెలివరీ బాయ్‌ కేసులో కొత్త ట్విస్ట్.. ఆతను నేరం చేయలేదు!

పార్శిల్ డెలివరీ బాయ్‌ కేసులో కొత్త ట్విస్ట్.. ఆతను నేరం చేయలేదు!
x
Highlights

పార్శిల్ డెలివరీ బాయ్ తనను హిప‍్నటైస్‌ చేసి అత్యాచారం చేయబోయడని నోయడాకి చెందినా ఓ మహిళ అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ కేసులో...

పార్శిల్ డెలివరీ బాయ్ తనను హిప‍్నటైస్‌ చేసి అత్యాచారం చేయబోయడని నోయడాకి చెందినా ఓ మహిళ అతడిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. కేసు పెట్టిన సదరు మహిళ దీనికి సంబంధించిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన నోయిడా(సిటీ) ఎస్‌ఐ వినీత్‌ జైస్వాల్‌ దీనిపైన స్పందిస్తూ... " ఈ కేసుపైన పార్శిల్ డెలివరీ బాయ్ ని మేము కస్టడిలోకి తీసుకొని విచారించాము... కానీ అతడు దీనిని ఖండించాడు.

వస్తువులను వెనుకకి తీసుకునే క్రమంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగిన మాట వాస్తవమేనని కానీ ఇది జరిగాక నేను అక్కడి నుండి వెళ్ళిపోయి అదే ప్లాట్ లోని మరికొందరికి డెలివరీలు అందజేసానని చెప్పాడు. దీనిపై బాధితురాలిని వైద్యపరీక్షలు చేయించుకోమని అడిగామనీ, కానీ ఆమె వైద్యపరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారానీ కేసును విచారిస్తున్న పోలీసులు చెప్పారు. అంతేకాకుండా ఆమె చేసిన ఫిర్యాదును కూడా వెనక్కు తీసుకున్నారని వివరించారు. దీంతో పార్శిల్ డెలివరీ బాయ్ పై వచ్చిన ఆరోపణలు నిజం కావని తేలిందని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై పార్శిల్ కి సంబంధించిన సంస్థ వివరణ ఇచ్చింది. ఆ సంస్థ అధికారులు ఈ విషయంపై స్పందిస్తూ.. పార్శిల్ తమ కస్టమర్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని చెప్పారు. వారి భద్రత కోసం పార్శిల్ ఎప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. తమ కస్టమర్ల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదనీ అయితే, నిజానికి ఈ సంఘటన సమయంలో అక్కడ డెలివరీ జరిగింది మూడో పార్టీ ద్వారా అని వివరించారు. కొన్ని ప్రదేశాల్లో పార్శిల్ వస్తువులను డెలివరీ చేయడానికి ఒక్కోసారి మూడో పార్టీకి అప్పచేబుతామనీ, అక్కడ కూడా అదేజరిగిందనీ చెప్పారు. అయినప్పటికీ ఈ సంఘటన విషయంలో తాము సీరియస్ గా ఉన్నామనీ, పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నమనీ పార్శిల్ సంస్థ పేర్కొంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories