పెళ్ళైన గంటకే కటకటాల పాలైన కొత్తజంట...

పెళ్ళైన  గంటకే కటకటాల పాలైన కొత్తజంట...
x
Highlights

పాపం వివాహం అయిన గంటలోపే ఓ జంట కటకటాల పాలైంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానికంగా నివాసముండే యాష్లే జోర్డాన్(30) అనే...

పాపం వివాహం అయిన గంటలోపే ఓ జంట కటకటాల పాలైంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానికంగా నివాసముండే యాష్లే జోర్డాన్(30) అనే యువతికి ఎరిక్ కార్డోవా(31) అనే యువకుడితో శనివారం ఉదయం ప్రెస్కోట్‌‌లో ఘనంగా పెళ్లైంది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన వధువు స్థానికంగా అక్కడ ఉండే ఓ చిన్న వ్యాపారితో గొడవ పడింది. ఆ గొడవలో భాగంగా ఆ యువతీ అతనిపై చేయి జేసుకుంది. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులపై వరుడు ఎరిక్ దురుసుగా ప్రవర్తించాడు..దీనితో పోలీసులు చేసేది ఏమిలేకా ఇద్దరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories