Top
logo

దొంగబాబా కీచక చేష్టలు...భర్తను బయటకు పంపి మహిళపై...

దొంగబాబా కీచక చేష్టలు...భర్తను బయటకు పంపి మహిళపై...
X
Highlights

తావీజ్ ఇది ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువగా చెప్పేమాట. ఆ కాలంలో ఏ దెబ్బకైనా, రోగానికైనా ఇదే మంత్రం అని...

తావీజ్ ఇది ఒకప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువగా చెప్పేమాట. ఆ కాలంలో ఏ దెబ్బకైనా, రోగానికైనా ఇదే మంత్రం అని భావించేవారు. కానీ కాలం మారిన కొంతమంది మూడనమ్మకాలు మరలేదు. ఇదే అసరాగా చేసుకుని కొంతమంది దొంగబాబాలు ప్రజల నమ్మకాలపై మాటల మత్తు వెదజల్లుతారు. స్వార్థ ప్రయోజనాలు, స్వయం లాభం కోసం మూఢనమ్మకాలను ఆయుధంగా మార్చుకుంటారు. అమాయక ప్రజలనే టార్గెట్‌గా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తోంది.

భార్యను దెయ్యాల కలలు వెంటాడుతుండటంతో బిలాల్‌ బాబాను ఆశ్రయించారు దంపతులు. ఇది ఛాన్స్‌గా భావించిన మంత్రగాడు కలకు తావీజ్‌తో చెక్‌ పెడతానని మాయమాటలు చెప్పి... మహిళపై మాంత్రికుడు కీచక చేష్టలకు దిగాడు. భర్తను బయటకు పంపి గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. తావీజ్‌ కట్టేప్పుడు న్యూడ్‌గా కనిపించాలని మహిళ బట్టలు లాగేశాడు. అక్కడితో ఆగకుండా ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు యత్నించడంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. భార్య అరుపులు విని లోపలికి వెళ్లిన భర్త దొంగ బాబా వెకిలిచేష్టల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Next Story