జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం..క్యాస్టింగ్ డైరెక్టర్ అరెస్ట్!

జూనియర్ ఆర్టిస్టులతో వ్యభిచారం..క్యాస్టింగ్ డైరెక్టర్ అరెస్ట్!
x
ప్రతికాత్మక చిత్రం
Highlights

ముంబైలో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోన్న క్యాస్టింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు మాయమాటలు...

ముంబైలో గత ఐదేళ్లుగా వ్యభిచార గృహాన్ని నడుపుతోన్న క్యాస్టింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండస్ట్రీకి అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి వ్యభిచార రొంపిలోకి దించుతున్నాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. నవీన్ కుమార్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఆయన స్నేహితులు అజయ్ శర్మ, విజయ్‌లతో కలిసి వ్యభిచార దందాకు తెరలేపారు.

నవీన్ గత కొన్ని నెలలుగా సెక్స్ రాకెట్ దందా నడిపిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేశారు. దీంతో పోలీసులు పథకం వేసి, సాధారణ వ్యక్తుల్లాగా నవీన్ కుమార్ కు ఫోన్ చేసి అమ్మాయిలు కావాలని అడిగారు. ఇద్దరు సినిమా స్టార్స్ ను పంపిస్తన్నామని, ఒక్కొక్కరికి రూ. 60 వేలు చెల్లించాలని చెప్పారు. అలానే హోటల్ బిల్లు కూడా చెల్లించాలని చెప్పారు. అలానే అని చెప్పడంతో నవీన్ కుమార్ ఇద్దరు మహిళలను తీసుకొని హోటల్ కు వెళ్లగా అక్కడ పోలీసులు నవీన్ ను అరెస్ట్ చేశారు. ఈ ఊబిలో ఎంతో మంది మేకప్ ఆర్టిస్టులు, పలువురు మోడళ్లు, బాలీవుడ్ జూనియర్ యాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories