కన్న తల్లే వ్యభిచార విషంతో కాటేస్తోంది!

కన్న తల్లే వ్యభిచార విషంతో కాటేస్తోంది!
x
Highlights

కన్నాతల్లె కూతుర్ని వ్యభిచార కూపంలోకి దించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబ్బు సంపాదన కోసం కన్న కూతుర్ని తప్పుడు పనిలోకి నెట్టాలని ప్రయత్నిస్తోంది....

కన్నాతల్లె కూతుర్ని వ్యభిచార కూపంలోకి దించాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబ్బు సంపాదన కోసం కన్న కూతుర్ని తప్పుడు పనిలోకి నెట్టాలని ప్రయత్నిస్తోంది. దానికి అంగీకరించని కూతుర్ని.. ఆమెకు అండగా నిలిచిన బాబాయినీ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేసి వేధిస్తోంది. అమ్మతనానికి తలవంపులు తెచ్చేలా ఉన్న ఈ వ్యవహారం హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

నగర శివార్లలో సుజాత అనే ఆమె తన భర్తతో జీవించేది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఏడేళ్ళ క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతో చిన్న కూతుర్ని భర్త తమ్ముడు అంటే మరిది ఇంటికి పంపించింది. ఆ అమ్మాయి నగరంలో బాబాయి ఇంటి వద్ద వుండి చదువు కొంటోంది. ఇలా సాఫీగా నడిచి పోతున్న సమయంలో సుజాత తనకు ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి చిన్న కూతుర్ని తన దగ్గరకు రమ్మని పిలిచింది. బాబాయి చెప్పడంతో ఆ అమ్మాయి అమ్మ దగ్గరకు వెళ్ళింది. అదే ఆమె తప్పయిపోయింది. డిగ్రీ చదువుతున్న తన చిన్న కుమార్తెను సుజాత డబ్బులు అవసరం ఉన్నాయి వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసింది. దానికి ఆ అమ్మాయి అంగీకరించలేదు. అక్కడ నుంచి తిరిగి బాబాయి దగ్గరకు వెళ్లిపోయింది. జరిగిన విషయం బాబాయికి చెప్పింది. ఇక అమ్మ దగ్గరకు వెళ్లొద్దు.. జాగ్రత్తగా చదువుకోమని అయన చెప్పాడు. ఇక సుజాత ఈ విషయంపై కోపాన్ని పెంచుకుంది. తన మరిది తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసుల విచారణలో అటువంటిది ఏమీ లేదని తేలింది. కానీ, కూతుర్ని ఎలా అయినా పడుపు వృత్తిలోకి దింపాలని సుజాత విశ్వప్రయత్నం చేస్తోంది. పదే పదే కన్న కూతురని కూడా చూడకుండా వేధిస్తోంది. దీంతో అమ్మ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ సుజాత చిన్న కూతురు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.

తన ఇద్దరు అక్కలనూ వ్యభిచారం లోకి దించిన అమ్మ ఇప్పుడు తననూ అదే వృత్తిలోకి దించాలని ప్రయత్నిస్తోందని ఆ అమ్మాయి వాపోతోంది. బాగా చదువుకుని లాయర్ కావాలనుకున్తున్నాననీ, కానీ తన తల్లే తనకు ఇబ్బందులు కల్గిస్తున్దడమే కాకుండా తనకు ఆశ్రయమిస్తున్న బాబాయినీ ఇబ్బందులకు గురిచేస్తోందనీ చెబుతోంది. కన్న తల్లే వ్యభిచార విషాన్ని కూతురిపై విరజిమ్ముతున్న వైనానికి అందరూ విస్తుపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories