ఒకే రోజు ముగ్గురు యువతులు అదృశ్యం.. హైదరాబాద్ లో కలకలం!

Three girls missing on same day in Hyderabad
x

హైదరాబాద్ లో ఒకేరోజు ముగ్గురు అమ్మాయిల అదృశ్యం 

Highlights

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు ఒకేరోజు కనిపించకుండా పోయారు. హైదరాబాద్ లో గురువారం వెలుగులోకి వచ్చిన ఈ అదృశ్య వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు ఒకేరోజు కనిపించకుండా పోయారు. హైదరాబాద్ లో గురువారం వెలుగులోకి వచ్చిన ఈ అదృశ్య వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని లాలగుడా, బౌద్ధ నగర్, తిరుమల గిరి స్టేషన్లల పరిధిలో ఈ అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి.

బౌద్ధనగర్ లో..

స్థానిక శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన రోహిణి (19) అమీర్ పేటలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. గురువారం ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్ళిన ఆమె రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి జగదీశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలగిరి లో..

తిరుమలగిరిలో నివాసం ఉంటూ ఒక స్కూల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న మంజుల (20) ప్రతి రోజూ లానే స్కూలుకు వెళ్ళింది. అక్కడ తన సహోధ్యాయులకు ఒక ఉత్తరం అందించి అది తన తల్లిదండ్రులకు చేర్చమని చెప్పి వెళ్ళిపోయింది. ఆ లేఖలో తనకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదని ఆమె పేర్కొంది. ఆ లేఖ చూసిన ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాసు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లాలాగుడాలో..

లాలాగుడా పరిధి అడ్డగుట్టలో ఒక యువతి గురువారం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కీర్తి ప్రజ్ఞ(20) తన తల్లిదండ్రులతో కలసి అడ్డగుట్టలో నివాసం ఉంటోంది. గురువారం బయట పని ఉందని తండ్రి శ్రీధర్ కు చెప్పి వెళ్ళింది. ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో శ్రీధర్, ఆయన స్నేహితులు ఆమె కోసం వెతికారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories