అక్క కూతురునే కిడ్నాప్ చేసిన మైనర్..పాపను బ్యాగ్‍‌లో పెట్టుకుని..

అక్క కూతురునే కిడ్నాప్ చేసిన మైనర్..పాపను బ్యాగ్‍‌లో పెట్టుకుని..
x
Highlights

సొంత అక్క కూతురునే కిడ్నాప్ చేసిన ఉదంతం విజయవాడలో చోటు చేసుకుంది. స్నానం చేసి వస్తానని కన్నబిడ్డను మైనర్ అయిన సొంత తమ్ముడికి అప్పగించింది. అయితే అక్క...

సొంత అక్క కూతురునే కిడ్నాప్ చేసిన ఉదంతం విజయవాడలో చోటు చేసుకుంది. స్నానం చేసి వస్తానని కన్నబిడ్డను మైనర్ అయిన సొంత తమ్ముడికి అప్పగించింది. అయితే అక్క బిడ్డను ఓ బ్యాగ్ లో దాచి.. పరారయ్యాడు. బిడ్డ కనిపించకపోయే సరికి పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు 4 బృందాలుగా వీడి.. కిడ్నాపర్ కోసం గాలించారు. సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించారు. అయితే మైనర్ దుండగుడు.. పెదపులిపాక పొలాల్లో బ్యాగ్‌తో సహా పాపను వదిలివెళ్లాడు. అయితే విషయం అందుకున్న పోలీసులు అక్కడి నుంచి పాపను తల్లి ఒడికి చేర్చారు. కేవలం 2 గంటల్లోనే చిన్నారి తల్లి ఒడికి చేరింది. అయితే కిడ్నాప్ కు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories