బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మాజీ సర్పంచ్‌.. మాజీ సర్పంచ్‌ను చితకబాదిన స్థానికులు

బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మాజీ సర్పంచ్‌.. మాజీ సర్పంచ్‌ను చితకబాదిన స్థానికులు
x
బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన మాజీ సర్పంచ్
Highlights

అతను బుద్ధి చెప్పాల్సిన పెద్ద మనిషి. వయసు 64 ఏళ్లు. వీధిలో ఒంటరిగా ఉన్న బాలికను ఇంట్లోకి పిలుపించుకొని అత్యాచారానికి ఒడిగొట్టాడు. ఈ అమానుష ఘటన ఉమ్మడి...

అతను బుద్ధి చెప్పాల్సిన పెద్ద మనిషి. వయసు 64 ఏళ్లు. వీధిలో ఒంటరిగా ఉన్న బాలికను ఇంట్లోకి పిలుపించుకొని అత్యాచారానికి ఒడిగొట్టాడు. ఈ అమానుష ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

ముదిగొండ మండలం మాదపురం గ్రామానికి చెందిన కోటిరెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు, బాలిక తల్లిదండ్రులు మాజీ సర్పంచ్‌ కోటిరెడ్డి ఇంటిపై దాడి చేసి అతన్ని చితకబాదారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories