ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం
x
Highlights

రోజు రోజుకి చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, 2 వేల జరిమానాను విధించింది.

రోజు రోజుకి చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, 2 వేల జరిమానాను విధించింది. ఇక వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట న్యూ పటేల్‌నగర్‌కు చెందిన గాదెల దయానంద్‌ (57) మెకానిక్‌. 2016 అక్టోబరు 10న దయానంద్‌ తమ ఇంటి వద్ద ఉండే ఆరేళ్ల చిన్నారిపై కన్నపడింది. చాకెట్లు ఇస్తానని ఆ చిన్నారిని ఇంట్లోకి పిలిచాడు. ఆ తరువాత బాలికను డాబాపైకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో ఆమె తల్లి డాబాపైకి పరుగెత్తుకు వచ్చింది. ఈస్ట్‌ జోన్‌ డీసీపీ ఎం.రమేశ్‌ ఆధ్వర్యంలో అంబర్‌పేట పోలీసులు ఈ కేసుని విచారించి కోర్టుకు సాక్ష్యాలను సమర్పించారు. నాంపల్లి మొదటి అడిషనల్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్డు జడ్జి సునీత గాదెల దయానంద్‌ కు పదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories