ప్రేమ వివాహం వెనుక ఉన్న అంతులేని విషాదాన్ని ముందే ఊహించలేక పోయారా.?

ప్రేమ వివాహం వెనుక ఉన్న అంతులేని విషాదాన్ని ముందే ఊహించలేక పోయారా.?
x
Highlights

ప్రేమించడమే వాళ్లు చేసిన నేరమా.? ప్రేమ వివాహం వెనుక ఉన్న అంతులేని విషాదాన్ని ముందే ఊహించలేక పోయారా.? గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన పరువు...

ప్రేమించడమే వాళ్లు చేసిన నేరమా.? ప్రేమ వివాహం వెనుక ఉన్న అంతులేని విషాదాన్ని ముందే ఊహించలేక పోయారా.? గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన పరువు హత్యోదంతం విషయంలో అసలేం జరిగింది.?

చందానగర్‌కు చెందిన హేమంత్‌ అతని ఇంటికి సమీపంలో ఉండే అవంతి ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో జూన్‌ 10వ తేదీన అవంతి ఇంటి నుంచి వచ్చేసి ఇద్దరూ కలిసి బీహెచ్‌ఈఎల్‌ సంతోషీమాత ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని యువతి తల్లిదండ్రులు, మేనమామలు తీవ్రగా వ్యతిరేకించారు. గతంలో అవంతిక కనిపించకుండా పోయినట్లు ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారు ఆ తరువాత ఇరు కుటుంబాలను పిలిచి పోలీసులు కౌన్స్లింగ్ చేశారు. ఆ సమయంలో కూడా అవంతిక బందువులు పోలీసులు ముందే దాడి చేసినట్లు తెలిపిన అవంతిక తల్లిదండ్రుల్లో మార్పు రాదనుకుని నిర్ణయించుకుని గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో భర్తతో కలసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్ష్మారెడ్డి అల్లుడు హేమంత్‌ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారు.

గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో అవంతి బంధువులు మరి కొందరు వ్యక్తులు మూడు కార్లలో హేమంత్‌ ఇంటికి వచ్చి ఇద్దరినీ బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి కారులో ఎక్కించారు. మార్గ మధ్యలో అవంతి కారులోంచి దూకేసి వారి నుండి తప్పించుకుంది. ఇక నలుగురు వ్యక్తులు హేమంత్‌ను కొట్టుకుంటూ కారులోనే తీసుకెళ్లారు. ఈవిషయాన్ని హేమంత్‌ ఫోన్‌ ద్వారా తల్లిదండ్రులకు లైవ్ లొకేషన్ సెండ్ చేశాడు. ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారు కిడ్నాపర్లు. అవంతిక వెంటనే డైల్ 100 కి కాల్ చేసి తన భర్తను ఆమె మేనమాలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారని చెప్పడంతో వెంటనే గచ్చి బౌలి పోలుసులను అలర్ట్ చేశారు అప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు మీద వెళ్లిన వాహనాల ఆచూకీ దొరకలేదు.

మరోవైపు హేమంత్ ను ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డికి తరలించిన కిడ్నాపర్లు తాడు సహాయంతో అతడి గొంతు బిగించి హత్య చేశారు. రాత్రి 7:30 గంటలకే హత్య చేసి సంగారెడ్డి మల్కాపూర్‌లో మృతదేహాన్ని పడేశారు. గురువారం సాయంత్రం నుంచి పోలీసులు గాలింపు చేపట్టగా శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లా కొల్లయ్యగూడెం వద్ద హేమంత్‌ శవమై కనిపించాడు. మరోవైపు హేమంత్ హత్యకు ఈనెల 20న లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డి కలిసి హత్యకు కుట్ర చేశారని, 10లక్షలకు ముగ్గురితో ఒప్పందం కుదర్చుకున్నట్లు తేలింది. లక్ష అడ్వాన్స్ ఇచ్చిన తరువాత ఎరుకల కృష్ణ, బిచ్చు యాదవ్, బాషా స్కెచ్ వేశారు. దీంతో పక్కా ప్లాన్డ్ తో మూడు కార్లలో హేమంత్ నివాసానికి వెళ్లి కిడ్నాప్ చేసినట్లు విచారణలో తేలింది. యుగంధర్ తో పాటు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేశారు.

ఏన్నో ఆశలు పెట్టుకుని పెంచుకున్న కుమారుడ్ని దారుణంగా చంపేశారని హేమంత్‌ తల్లి రాణి బోరున విలపించారు. వేర్వేరు కులాలు అయినందు వల్లే తమ బిడ్డనుపొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. అటు తన భర్తను చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని హేమంత్ భార్య అవంతి కోరుతోంది. తన భర్త ఎప్పుడూ ఎవరినీ ఇబ్బందిపెట్టలేదని అలాంటివాడిని ఎందుకు చంపారని ఆమె ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మేనమామ యుగంధర్ రెడ్డితో పాటు రాకేశ్ రెడ్డి, రంజిత్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రజిత, స్పందన, స్వప్న, అర్చన పోలీసుల అదుపులో ఉన్నారు.

మిర్యాలగూడ తరహాలో జరిగిన ఈ పరువు హత్యోదంతంతో హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రేమ వివాహాల విషయంలో జరుగుతోన్న పరువు హత్యలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హేమంత్, అవంతిల ప్రేమ వివాహం విషయంలో కూడా పోలీసులు కాస్త జాగ్రత్త వహిస్తే ఇంత ఘోరం జరిగుండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories