ప్రియుడితో పరారీకి వివాహిత యత్నం.. అడ్డుకున్న తండ్రిపై దాడి

ప్రియుడితో పరారీకి వివాహిత యత్నం.. అడ్డుకున్న తండ్రిపై దాడి
x
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వివాహితతో కలిసి పరారవుతున్న వ్యక్తిని అడ్డుకున్నందకు ఆమె తండ్రి గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని...

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వివాహితతో కలిసి పరారవుతున్న వ్యక్తిని అడ్డుకున్నందకు ఆమె తండ్రి గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని అనపర్తిలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాత ఊరికి చెందిన చింతపల్లి శేషారత్నం అనే వివాహిత తన కుమార్తెను స్కూలుకు పంపే క్రమంలో బస్సు క్లీనర్‌తో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగామారింది. దీంతో ఆ ఇద్దరు ఎక్కడికైనా పారిపోయి బ్రతకాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి శేషారత్నం ప్రియుడితో పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన ఆమె తండ్రి వెంకటేశ్వరరావు, శేషారత్నాన్ని మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ప్రియుడు.. వెంకటేశ్వరరావు గొంతు కోసి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలవడంతో ఆయనను హుటాహుటిన అనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories