logo

ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బు గుంజుతున్న కేటుగాడు...ముగ్గురితో సహజీవనం...

ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బు గుంజుతున్న కేటుగాడు...ముగ్గురితో సహజీవనం...

ఫేస్ బుక్, వాట్సాప్ లలో అమ్మాయిలను ప్రలోభాలకు గురి చేస్తున్న తాటి చెట్ల వాసు అనే మోసగాడిని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో పరిచయం అయిన అమ్మాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నట్టు గుర్తించారు. ఇందుకూరుపేటకు చెందిన వాసు ఫేస్ బుక్ వేదికగా అమ్మాయిలతో చాటింగులు చేసేవాడు ఫ్రెండ్ గా పరిచయం అయి ఆతర్వాత ప్రేమ పేరుతో లోబర్చుకునేవాడు. ఇలా దాదాపు పదుల సంఖ్యలో అమ్మాయిలను మోసం చేసి వారి వద్ద నుంచి 12 లక్షల దాకా స్వాహా చేశాడు. మరో ముగ్గురితో సహజీవనం చేసి వారిని కూడా వదిలేసినట్టు పోలీసులు గుర్తించారు. బాలాజీ నగర్ కు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇతని పై నెల్లూరు, సైదా పురంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా పలు కేసులు ఉన్నట్లు టౌన్ డిఎస్పీ మురళి క్రిష్ణ తెలిపారు.


లైవ్ టీవి

Share it
Top