మహిళతో అసభ్య ప్రవర్తన.. భర్త చేతిలో హతం!

మహిళతో అసభ్య ప్రవర్తన.. భర్త చేతిలో హతం!
x
Highlights

ఫుల్లుగా తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి గుడిసెలో నిద్రిస్తున్న మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన ఆ మహిళ భర్త దాడి చేయడంతో అతను చనిపోయిన ఘటన సోమవారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఫుల్లుగా తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి గుడిసెలో నిద్రిస్తున్న మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన ఆ మహిళ భర్త దాడి చేయడంతో అతను చనిపోయిన ఘటన సోమవారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలోని గుడిసెల ప్రాంతంలో రాజు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఫుల్లుగా మద్యం సేవించిన దుర్గా(30) అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న రాజు భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. చేయిపట్టుకొని లాగుతూ మహిళను ఇబ్బంది పెట్టాడు.

అయితే ఇది గమనించిన రాజు అతన్ని ప్రశ్నిచంగా.. నువ్వే ఏంటి నాకు చెప్పేది అంటూ దుర్గా అన్నాడు దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇదే సమయంలో దుర్గా కత్తితో రాజుపై దాడిచేశాడు. దీంతో తీవ్ర కోపంతో ఉన్న రాజు కర్రతో దుర్గా తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దుర్గాను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ దుర్గా మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories