Top
logo

ప్రేమ పేరిట యువతి ఇంటిపై పెట్రోల్ దాడి.. నలుగురు సజీవదహనం

ప్రేమ పేరిట యువతి ఇంటిపై పెట్రోల్ దాడి.. నలుగురు సజీవదహనంప్రేమ పేరిట యువతి ఇంటిపై పెట్రోలు దాడి.. నలుగురు సజీవదహనం
Highlights

తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమ పేరుతో యువతి ఇంటిపై...

తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమ పేరుతో యువతి ఇంటిపై పెట్రోల్ దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు సజీవదహనం అయ్యారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కడియం మండలం దుళ్లలో చోటు చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువతి ఇంటికి ప్రియుడు నిప్పు పెట్టాడు. తనతో పెళ్లికి నిరాకరించిందని ఆగ్రహించిన ప్రేమోన్మాది ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తాను ప్రేమించిన అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారన్న ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనం అయ్యారు. మరి కొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి కూడా ఉంది. గాయపడిన వారు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ఉన్మాది దుళ్ల పెట్రోల్‌ బంక్‌లో అర్ధరాత్రి ఒంటి గంటకు పెట్రోల్‌ కొనుగోలు చేసినట్లు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించారు.

Web Titlelover set girlfriend's house on fire in East Godavari district
Next Story


లైవ్ టీవి