చిరుత మృతి వ్యవహారాన్ని చేధించిన పోలీసులు...నిందితులను పట్టించిన డాగ్ స్క్వాడ్

Leopard
x
Leopard
Highlights

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చిరుత మృతి వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. అటవీ శాఖ ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు...

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చిరుత మృతి వ్యవహారాన్ని పోలీసులు చేధించారు. అటవీ శాఖ ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. చిరుత కళేబరం లభించిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తుల ఇళ్ల దగ్గర డాగ్ స్క్వాడ్ సంచరించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు .ఇదే సమయంలో పులి గోర్లు, దంతాల కోసమే హతమార్చినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంతో అదే కోణంలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా చిరుతకు చెందిన ఏడు గోర్లు, నాలుగు దంతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు వీరి నుంచి వేట కొడవలితో పాటు గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట అయిన వారంతా కూలి పనులు చేస్తున్నా వారిగా పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories