logo

మహారాష్ట్రలో దారుణం

Leopard cubLeopard cub

మహారాష్ట్రలో దారుణం జరిగింది. చిరుతపిల్లను వెంటాడి మరీ చంపేశారు కోయిలార్‌ గ్రామస్తులు. గ్రామంలోకి ప్రవేశించిన చిరుతను చూసిన స్థానికులు మొదట భయంతో పరుగులు తీశారు. చిరుత అటు ఇటు తిరుగుతూ కనిపించడంతో ఆగ్రహించిన స్థానికులు కర్రలతో ఇష్టానుసారంగా చితకబాదారు.

జనం దెబ్బలను భరించలేని చిరుతపిల్ల చెట్టు ఎక్కి తప్పించుకునేందుకు యత్నించింది. అయినా స్థానికులు వదలకుండా కర్రలతో చితకబాదుతూ తోకను పట్టుకుని నానా హింసలకు గురి చేశారు. నేలకేసి బాదారు. ఆపై వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందారు. చివరకు వారి దెబ్బలకు ప్రాణాలు కోల్పోయిందీ చిరుతపిల్ల. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుమోటగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

లైవ్ టీవి

Share it
Top