Law Students Gang Raped : విశాఖలో లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్..రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Nov 2024 8:25 AM IST
College student gang-raped by group of ten students at Gopalpur beach Odisha telugu news
X

Odisha: ప్రియుడిని నిర్బంధించి.. యువతిపై 10 మంది గ్యాంగ్‌రేప్‌..!!

Law Students Gang Raped On Friend Girlfriend In Visakhapatnam : విశాఖలో దారుణం జరిగింది. ఓ యువతిపై ప్రియుడు సహా మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరానికి చెందిన ఓ యువతికి సహా విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా వంశీ బలవంతంగా ఆమెను లోబర్చుకున్నాడు.

ఆగస్టు 13న వంశీ ఆ యువతిని బైక్ మీద తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్..రాజేశ్, జగదీశ్ గదిలోకి వచ్చి యువతిని బెదిరించారు. తర్వాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్ధులు కాగా ఒకరు ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్ గా పనిచేస్తున్నారు.

ప్రియుడు దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో బాధితురాలు అతన్ని నిలదీసింది. ఆ తర్వాత అతను యువతిని బెదిరించాడు. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించిన బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంది.

మళ్లీ తన కోరిక తీర్చాలంటూ రెండు నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధించారు. వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్లు చేయాలని అనడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేసింది.

కుటుంబ సభ్యులు ఆమెను కాపాడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story