అన్నం వండలేదని.. భార్య కాళ్లు చేతులు కోశాడు!

అన్నం వండలేదని.. భార్య కాళ్లు చేతులు కోశాడు!
x
Highlights

భార్య అన్నం వండలేదని భర్త ఆమె చేతులు, కాళ్లు కోసిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతం గొల్లపాలెంగట్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి...

భార్య అన్నం వండలేదని భర్త ఆమె చేతులు, కాళ్లు కోసిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతం గొల్లపాలెంగట్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కాలనీకి చెందిన అన్నపురెడ్డి జగదీష్‌రెడ్డి, హాసినికి ఏడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న జగదీష్‌ కుటుంబ పోషణకు సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 12.30 గంటలకు భర్త ఇంటికి వచ్చి అన్నం పెట్టమన్నాడు. బియ్యం లేక వండ లేదని భార్య చెప్పింది. దీనితో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ భార్యను చాకుతో చేతుల మీద, కాళ్లపై కోశాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories