ఒక్కొక్కటి బయటపడుతున్న ప్రవీణ్ ఆగడాలు..ఇంజెక్షన్లతో..

ఒక్కొక్కటి బయటపడుతున్న ప్రవీణ్ ఆగడాలు..ఇంజెక్షన్లతో..
x
Highlights

వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి ఆగడాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. మూడేళ్లుగా మహిళలు, యువతులకు కంటిమీద కునుకు...

వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడి ఆగడాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. మూడేళ్లుగా మహిళలు, యువతులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కామాంధుడు ఇతనేనని తెలుస్తోంది. మహిళలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కిటికీల్లో నుంచి ఇంజెక్షన్లతో నీళ్లు స్ప్రే చేసి కామవాంఛ తీర్చుకున్న ప్రవీణ్ ఇతనేనని తెలుస్తోంది. తాజాగా పసిపాపపై అత్యాచారం, హత్య ఘటనతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలంటున్నారు. వరంగల్‌‌లో మహిళలు, విద్యార్థులు పెద్దఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories