Top
logo

పుట్టిన రోజే మృగాడి చేతికి చిక్కి బలైన యువతి.. నేరాన్ని అంగీకరించిన..

పుట్టిన రోజే మృగాడి చేతికి చిక్కి బలైన యువతి.. నేరాన్ని అంగీకరించిన..హన్మకొండ
Highlights

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ యువతి తన పుట్టినరోజు నాడే మృగాడి చేతికి చిక్కి బలైపోయింది. గుడికి వెళ్లి,...

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ యువతి తన పుట్టినరోజు నాడే మృగాడి చేతికి చిక్కి బలైపోయింది. గుడికి వెళ్లి, అట్నుంచి స్నేహితుల్ని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి రాత్రికి విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో శవమై కన్పించింది.

ఈ ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు మానస తల్లిదండ్రులు. ఘటనా స్థలంలో ఆధారాల్ని బట్టి చూస్తే అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణ జరుపుతుండగానే తానే అత్యాచారం చేసి హత్యచేసినట్టు పోలీసుల ఎదుట లొంగిపోయాడు నిందితుడు. వరంగల్‌కు చెందిన సాయిగౌడ్‌ అనే యువకుడు సుబేదార్‌ పోలీసుల ముందు లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. యువతిని రేప్‌ చేసి చంపినట్టు అంగీకరించాడు. సాయిగౌడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక స్నేహితులతో కలిసి దుర్మార్గానికి ఒడిగట్టాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Web Titlegirl murdered in Warangal

లైవ్ టీవి


Share it
Top