Viral news: 16ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ రాసలీలలు.. మాత్రలు ఇచ్చి మరీ..!

Viral news
x

Viral news: 16ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ రాసలీలలు.. మాత్రలు ఇచ్చి మరీ..!

Highlights

Viral news: ముంబైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న మహిళ, 11వ తరగతి చదువుతున్న విద్యార్థిపై గత ఏడాది నుండి అనుచిత ప్రవర్తన కొనసాగించినట్లు సమాచారం.

Viral news: మహిళా టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఓ టీచర్, 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, 40 ఏళ్ల టీచర్‌ను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు జువైనల్ జస్టిస్ చట్టం కింద ఆమెపై కేసులు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, ముంబైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న మహిళ, 11వ తరగతి చదువుతున్న విద్యార్థిపై గత ఏడాది నుండి అనుచిత ప్రవర్తన కొనసాగించినట్లు సమాచారం. 2023లో స్కూల్ వార్షికోత్సవంలో భాగంగా డ్యాన్స్ గ్రూప్ ఏర్పాటులో ఆమెకు బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా అసాధారణంగా మారింది.

కారులో, హోటల్‌లో లైంగిక వేధింపులు

2024 జనవరిలో తొలిసారి విద్యార్థిని లైంగికంగా వేధించిన ఆమె, అనంతరం పలుమార్లు బాలుడిని కారులో, లగ్జరీ హోటళ్లలోకి తీసుకెళ్లి శారీరకంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో టీచర్ తన స్నేహితురాలిని కూడా రంగంలోకి దించిందని పోలీసులు తెలిపారు. "వృద్ధ మహిళలు – టీనేజర్ల మధ్య సంబంధాలు సాధారణం" అంటూ బాలుడిని మాయ మాటలతో ప్రభావితం చేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అంతే కాదు, బాలుడి నిరాకరణను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నంగా, అతనికి మద్యం పిలించి, ఆ తర్వాత యాంటీ-యాంగ్జైటీ మాత్రలు కూడా ఇచ్చినట్లు సమాచారం. బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పరీక్షల అనంతరం స్కూల్ మారుస్తామని ఆ కుటుంబం మౌనంగా వ్యవహరించింది.

12వ తరగతి తర్వాత కూడా వేధింపులు కొనసాగింపు

ఇంకా వింత విషయం ఏమిటంటే – బాలుడు 12వ తరగతి పూర్తి చేసి స్కూల్‌ విడిచిన తర్వాత కూడా టీచర్ వేధింపులు ఆపలేదట. తన ఇంట్లో పనిచేసే సిబ్బంది ద్వారా విద్యార్థిని సంప్రదించి మరోసారి కలవమని ఒత్తిడి చేసింది. చివరకు బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

పెళ్లయిన టీచర్‌పై కేసు నమోదు, అరెస్ట్

ఈ నేపథ్యంలో మహిళా టీచర్‌పై పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ మహిళకు పెళ్లయి, పిల్లలు ఉన్నట్లు వెల్లడైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories