యూ ట్యూబ్‌ చూసి.. నాటు తుపాకులు చేసి..

యూ ట్యూబ్‌ చూసి.. నాటు తుపాకులు చేసి..
x
Highlights

ఆర్థిక ఇబ్బందులతో చేతినైపుణ్యం ఉన్న కళాకారుడు నిందితుడిగా మారాడు. నకిలీ నక్సలైట్లు డబ్బు ఆశచూపడంతో తన కళను ఉపయోగించి 8mm స్థాయి గన్స్ తయారీ చేశాడు....

ఆర్థిక ఇబ్బందులతో చేతినైపుణ్యం ఉన్న కళాకారుడు నిందితుడిగా మారాడు. నకిలీ నక్సలైట్లు డబ్బు ఆశచూపడంతో తన కళను ఉపయోగించి 8mm స్థాయి గన్స్ తయారీ చేశాడు. పక్క పధకం ప్రకారం దారిదోపిడికి పాల్పడ్డాడు. జనగామ జిల్లా కొడగండ్లలో మొండ్రాయి తిరుమల వైన్స్ నిర్వాహకుల షాప్ మూసివేసి రాత్రి ఇంటికి వెళ్లి క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపి వారి నుంచి 5.56 లక్షల రూపాయలు దోపిడి చేశాడు.

కొడకండ్ల మండలకేంద్రంలో తిరుమల బ్రాందీషాపు యజమానులు ప్రతీ రోజు రాత్రి నగదు తీసుకుని పాలకుర్తికి వెళ్తారు. మద్యం షాపు యజమానుల కదలికలను దొంగలు పసిగట్టారు. వారు తీసుకెళ్లే డబ్బులు ఎలాగైనా దోచుకోవాలని పధకం పన్నారు. ముందుగా గత డిసెంబరు 31న దోపిడీ చేయాలని ప్లాన్‌ చేసి వైఫల్యం చెందారు. అయితే సంక్రాంతి రోజు రాత్రి సుమారు 12గంటలకు బ్రాందీషాపు యజమానులు షాపు మూసివేసి నగదును తీసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. వీరు పాలకుర్తి రోడ్డుకు వస్తారని ముందుగానే తెలుసుకుని మొండ్రాయి సమీపంలోని రామన్నగూడెం వద్ద తుపాకులతో కాపు కాచారు. నలుగురిలో శంకర్‌ రోడ్డుపై ఉండగా, మిగతా ముగ్గురు మద్యంషాపు యజమానులు వచ్చే రోడ్డుకు తాడు అడ్డుగా కట్టి అటకాయించారు. ఒక రౌండ్‌ గాలిలోకి పేల్చి రూ.5.56 లక్షల నగదును లాక్కుని పారిపోయారు. బాధితులు మర్నాడు కొడకండ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కొడకండ్ల వద్ద దోపిడీ కేసును పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. అక్కడి సీసీ కెమెరాలు, ఐటీ, సైబర్‌ క్రైం బృందాల ద్వారా సమాచారాన్న సేకరించి నిందితులను గుర్తించారు. అందులో స్వామి, శంకర్‌, శ్రీనివాస్‌, మల్లేశం కొడకండ్ల చెరువు వద్ద తలదాచుకోగా పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు అరెస్టు చేశారు. విచారించగా దోపిడీ చేసిన డబ్బు, తుపాకులు చెన్నూరులో స్నేహితులైన పరమేష్‌, విప్లవ్‌ వద్ద ఉన్నట్టు విచారణలో ఒప్పుకున్నారు. పోలీసులు అప్రమత్తమై ఇద్దరిని అరెస్టు చేసి రూ.5.56 లక్షల నగదు, మూడు నాటు తుపాకులు 10 తుటాలు, 11 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మాజీ నక్సలైట్లు ఉన్నారు.

కొడకండ్ల కాల్పులతో దారిదోపిడికి పాల్పడ్డ ఆరుగురు నకిలీ నక్సలైట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 3 తపంచాలు.. 10 బుల్లెట్లు.. 11 సెల్ ఫోన్స్,5 లక్షల 56 వేళా నగదు స్వాదీనం చేసుకున్నారు. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. రవీందర్ కేసు పూర్వాపరాలను వివరించారు.

నిందితుల్లో ఒకరైన పిట్టల శ్రీనివాస్‌ స్థానికంగా ఉండి పెద్దసైజు బొమ్మలు తయారు చేసేవాడు. చదువు పరిజ్ఞానం లేకున్నా మంచి నేర్పరి. ఒక వస్తువును చూసి మరో వస్తువును సులువుగా తయారు చేస్తాడు. అతని వ్యాపారంలో నష్టం రావడంతో దోపిడి ముఠాతో చేతులు కలిపాడు. శ్రీనివాస్‌ యూట్యూబ్‌లో చూసి సైకిల్‌ బొంగులతో నాటు తుపాకులు, ఇనుప ముక్కలతో కంట్రిమేడ్‌ బుల్లెట్లు సైతం తయారు చేశాడు. రెండు నెలల్లో తయారు చేసిన మూడు నాటు తుపాకులను మిగతా సభ్యులకు అందించాడు. కేసులో శ్రీనివాస్‌ను అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు నివ్వెరపోయారు. నాటు తుపాకులు సైతం ఇరత రాష్ట్రాల్లో కొనుగోలు చేసే వ్యక్తులు ఉండగా బుల్లెట్లు కూడా ఇక్కడ తయారు చేశానని చెప్పడంతో ఉలిక్కిపడ్డారు. అయితే విషయం బయటకు పొక్కడంతో శ్రీనివాస్‌ తప్పించుకునేందుకు విహార యాత్రలకు వెళ్ళాడు. పోలీసులు అతన్ని సెల్‌టవర్‌ లొకేషన్‌ ఆధారంగా అరెస్టు చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories