కొలంబోలో మరో బాంబు పేలుడు...మోటర్ సైకిల్‌లో...

కొలంబోలో మరో బాంబు పేలుడు...మోటర్ సైకిల్‌లో...
x
Highlights

శ్రీలంకలో మరిన్ని పేలుళ్లకు ఐసీస్ కుట్ర చేస్తునట్లు సమాచారం అందుతోంది తాజాగా కొలంబోలో మరో బాంబు పేలుడు సంభవించింది. మోటర్ సైకిల్‌లో పేలుడు పదార్థాలు...

శ్రీలంకలో మరిన్ని పేలుళ్లకు ఐసీస్ కుట్ర చేస్తునట్లు సమాచారం అందుతోంది తాజాగా కొలంబోలో మరో బాంబు పేలుడు సంభవించింది. మోటర్ సైకిల్‌లో పేలుడు పదార్థాలు ఉగ్రవాదులు పెట్టారు. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద ఉగ్రవాదులు డియో బైక్‌లో బాంబులు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నప్పటికీ ఎవరూ గుర్తించకపోవడం భద్రతా లోపాన్ని స్పష్టంచేస్తోంది. ఐసిస్ ఈసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories