Top
logo

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
X
ప్రతీకాత్మక చిత్రం
Highlights

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతులంతా నందిగామాకు చెందివారని తెలుస్తుంది. మనోజ్‌, అరవింద్, దుర్గ, అనిల్‌గా గుర్తించారు.

నదిగామకు చెందిన వీరు సరదాగా కారులో బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్లు తెలుస్తోంది. అతి వేగంగా వచ్చిన వారి కారు నందిగామ బైపాస్ వద్ద ఆగి ఉన్న డీసీఎం లారీని ఢీకొట్టింది. దీంతో ముగ్గరు ఘటన స్థలంలోనే మరణించగా, మరోవ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. వారి శరీరాలు నుజ్జూ నుజ్జయ్యాయి. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న సహాయ్య చర్యలు చేపట్టారు. అనంతంరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Web TitleFour mens died in road accident at krishna district
Next Story