logo

ఐదేళ్ల ఫాతిమా కోసం కొనసాగుతున్న గాలింపు

ఐదేళ్ల ఫాతిమా కోసం కొనసాగుతున్న గాలింపు
Highlights

సికింద్రాబాద్‌ రాంగోపాల్‌ పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిన్న కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల పాప ఆచూకీ కోసం...

సికింద్రాబాద్‌ రాంగోపాల్‌ పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిన్న కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల పాప ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ ఫూటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. రాజు, హసీనా దంపతులు ఓ ఫంక్షన్‌ హాల్‌లో పనిచేస్తున్నారు. వీరి కూతురు ఫాతిమాకు జ్వరం రావడంతో.. నీలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి.. ఐదేళ్ల ఫాతిమాను అపహరించాడు.

కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్‌ పేట్ పోలీసులు.. ఫాతీమా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పాపను ఆస్పత్రిలో చూపించేందుకు తీసుకెళ్తుండగా.. గతంలో రాజుకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి తారసపడ్డాడు. అక్కడే పాపకు పాల కోసం హోటల్‌కు వెళ్లే క్రమంలో ఫాతిమాను పరిచయస్తుడికి ఇచ్చి వెళ్లారు. హోటల్‌కు వెళ్లి పాలు తీసుకొచ్చే సరికి.. పాప కనిపించలేదు. దీంతో ఫాతిమా కోసం వెతికిన తల్లిదండ్రులు రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫాతిమా ఆచూకీ కోసం.. సీసీ ఫూటేజీని పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని.. తెలిపారు.

లైవ్ టీవి

Share it
Top