Top
logo

దుబ్బాకలో దారుణం!

దుబ్బాకలో దారుణం!
X
Highlights

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని లచ్చపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా పిల్లలను కాపాడాల్సిన...

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని లచ్చపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా పిల్లలను కాపాడాల్సిన తండ్రే కన్న కూతుళ్లను అత్యంత దారుణంగా ఉరి వేసి చంపిన ఘటన లచ్చపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాజు మద్యం మత్తులో తొమ్మిదేళ్ళ పెద్ద కూతురు భవానితో పాటు ఐదేళ్ల రెండో కూతురు లక్ష్మికి ఉరి వేసి చంపాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారుల ఇద్దరి చేతులు వెనక్కు ఉండటంతో ఉరి వేసి చంపినట్టు నిర్దారణకు వచ్చారు. కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లతోనే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Next Story