Road Accident: పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరప్రమాదం..13 మంది మృతి

Road Accident: కర్ణాటకలోని హవేరీలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మరనించారు. రోడ్డు పై ఆగి ఉన్నవాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Dhivi
Published on: 28 Jun 2024 8:44 AM IST
Road Accident: పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరప్రమాదం..13 మంది మృతి
X

Road Accident: పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోరప్రమాదం..13 మంది మృతి

Road Accident: కర్ణాటకలోని హవేరీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. హవేరీలోని బాద్గిలో రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. హవేరి జిల్లా బాద్గి తాలూకాలోని గుండెనహళ్లి క్రాస్ సమీపంలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రయాణికుల వాహనం ఢీకొట్టడంతోఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. స్థానికుల సమాచారంలో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

మృతులు షిమోగా జిల్లా భద్రావతి తాలూకాలోని హోలెహోన్నూరు సమీపంలోని ఎమ్మిహట్టి గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కలబురగి జిల్లాలోని చించోలి మాయమ్మను దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన 13 మందిలో ఒక చిన్నారి కూడా ఉంది. సంఘటనా స్థలాన్ని హవేరి ఎస్పీ అన్షుకుమార్ పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది టీటీ వాహనంలోంచి మృతదేహాలను బయటకు తీశారని, క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. 13 మంది మృతి వార్త విని ఎమ్మెహట్టి గ్రామ ప్రజలు దిగ్భ్రాంతి చెందగా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారని చెబుతున్నారు.

Dhivi

Dhivi

Next Story