డాక్టర్‌ వెకిలిచేష్టలు.. చితకబాదిన మహిళా ఉద్యోగుల కుటుంబ సభ్యులు !

డాక్టర్‌ వెకిలిచేష్టలు.. చితకబాదిన మహిళా ఉద్యోగుల కుటుంబ సభ్యులు !
x
డాక్టర్‌ వెకిలిచేష్టలు.. చితకబాదిన మహిళా ఉద్యోగుల కుటుంబ సభ్యులు !
Highlights

డాక్టర్‌ అంటే దేవుడితో సమానం అన్న భావన రోగుల్లోనే కాదు సామాన్యుల్లోనూ వ్యక్తమవుతోంది. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఆ డాక్టర్‌కి బుద్ది...

డాక్టర్‌ అంటే దేవుడితో సమానం అన్న భావన రోగుల్లోనే కాదు సామాన్యుల్లోనూ వ్యక్తమవుతోంది. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఆ డాక్టర్‌కి బుద్ది గడ్డితిన్నట్లుంది. కన్పించిన ప్రతి మహిళను అదోలా చూడటం ఆపై వెకిలి చేష్టలు వేయడం పరిపాటిగా మారింది. దీంతో విసిగిపోయిన మహిళా సిబ్బంది ఆ వైద్యుడికి బుద్ది చెప్పారు. వైద్య కేంద్రంలోనే దేహశుద్ధి చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజాగా గత రాత్రి డ్యూటీలో ఉన్న స్టాఫ్‌ నర్స్‌ పట్ల డాక్టర్‌ ఠాగూర్‌ అనుచితంగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త, కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆగ్రహించిన బాధిత మహిళ కుటుంబ సభ్యులు డాక్టర్‌ ఠాగూర్‌ను చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories