భర‍్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి.. కరీంనగర్‌ సమీపంలో పెను విషాదం

భర‍్త, కుమార్తెతో సహా ఎమ్మెల్యే సోదరి మృతి.. కరీంనగర్‌ సమీపంలో పెను విషాదం
x
కరీంనగర్‌ సమీపంలో పెను విషాదం
Highlights

కూతురికి పెళ్లి కుదిరిందన్న ఆనందం షాపింగ్ కోసం కారులో బయలు దేరారు. పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ వాయు వేగంతో కారు దూసుకెళ్తోంది. అంతలోనే అనుకోని ఘటన...

కూతురికి పెళ్లి కుదిరిందన్న ఆనందం షాపింగ్ కోసం కారులో బయలు దేరారు. పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటూ వాయు వేగంతో కారు దూసుకెళ్తోంది. అంతలోనే అనుకోని ఘటన ఎదురైంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కట్ చేస్తే కారు కెనాల్‌లో తేలింది. 27 రోజుల తర్వాత నారెడ్డి సత్యనారాయణరెడ్డి, భార్య, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో బయటపడ్డాయి.

కరీంనగర్‌ శివారులోని అల్గునూరు వద్ద కాకతీయ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన నారెడ్డి సత్యనారాయణరెడ్డి కుటుంబంగా గుర్తించారు. కాకతీయ కెనాల్‌లో లభ్యమైన మృతదేహాలు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ సోదరి కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు ఆదివారం రాత్రి ఓ బైక్‌ అదుపుతప్పి కాకతీయ కాల్వలోకి వెళ్లడంతో దంపతులు నీటిలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో భర్త ప్రాణాలతో బయటపడగా అతని భార్య మృతిచెందింది. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం వెంకటనారాయణ ప్రదీప్‌ తన భార్య కీర్తనతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. దంపతులిద్దరూ ఓ శుభకార్యం నిమిత్తం కరీంనగర్‌కు వచ్చారు. శుభకార్యం అనంతరం ఆదివారం రాత్రి తిమ్మాపూర్‌ మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి బైక్‌పై బయలు దేరారు. ఈ క్రమంలో అల్గునూర్‌ కాకతీయ కాల్వ వద్దకు చేరుకోగానే ప్రదీప్‌ కంట్లో పురుగులు పడడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పింది. వాహనంతో సహా వారిద్దరూ కాకతీయ కాల్వలో పడ్డారు.

దీనికి సమీప ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్న జంట ప్రమాదాలు స్థానికులను విషాదంలో నింపాయి. లారీ ఢీకొని మానేరు వంతెన పైనుంచి కారు బోల్తా పడటంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందగా ఆయన భార్యకు గాయాలయ్యాయి. సాయం చేసేందుకు వచ్చిన కానిస్టేబుల్‌ వంతెనపై నుంచి జారి పడి మృత్యువాత పడ్డాడు. వరుస సంఘటనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories