Top
logo

క్యూనెట్ కుంభకోణం: బాలీవుడ్‌ స్టార్స్‌కి రెండోసారి నోటీసులు

క్యూనెట్ కుంభకోణం: బాలీవుడ్‌ స్టార్స్‌కి రెండోసారి నోటీసులు
X
Highlights

Q నెట్ స్కాంలో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐదు వేల కోట్ల రూపాయలు వరకు మోసం చేసినట్లు తాజాగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ గుర్తించింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా లక్షల మంది బాధితులు ఉన్నట్టు విచారణలో తేలింది.

Q నెట్ స్కాంలో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐదు వేల కోట్ల రూపాయలు వరకు మోసం చేసినట్లు తాజాగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ గుర్తించింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా లక్షల మంది బాధితులు ఉన్నట్టు విచారణలో తేలింది. బాలీవుడ్‌ స్టార్స్‌ ఇచ్చిన ప్రకటనలకు వేల మంది పెట్టుబడులు పెట్టారని ఫిర్యాదులు రావడంతో రెండో సారి నోటీసులు జారీ చేశారు సైబరాబాద్‌ పోలీసులు.

హాంకాంగ్ కేంద్రంగా నడుస్తున్న క్యూ నెట్ కార్యకలాపాలకు బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలను మభ్యపెట్టి వేల కోట్ల రూపాయలు సొమ్మును పెట్టుబడుల రూపంలో ఆకర్షించి నట్టేట ముంచింది. దీంతో కొన్ని రోజులు క్రితమే Q నెట్ స్కాం పై వస్తున్న ఫిర్యాదులు ఎంత వరకు వాస్తవం అనేది తేల్చాలని మినిస్టరీ కార్పోరేట్ అఫైర్స్, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విచారణ చేసిన రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. Q నెట్ సంస్థ మోసపూరితమైన సంస్థ అని, అందులో ఎవరు పెట్టుబడులు పెట్టుకుండా చూడాలంటూ నివేదిక ఇచ్చింది.

ఈ స్కాం పై సైబరాబాద్ పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేశారు. క్యూనెట్ సంస్థ మొత్తం ఐదు వేల కోట్లు రూపాయల మోసానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం ఈ కేసులో 70 మందిని అరెస్ట్ చేసి, 38 కేసులు నమోడు చేశారు. కంపెనీ లావాదేవీలు, రికార్డ్‌ను పరిశీలించగా Q నెట్ సంస్థ మోసాలకు పాల్పడుతుందని తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో 12 మంది ప్రముఖులు దేశం విడిచి వెళ్లకుండా లూక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

క్యూ నెట్‌ స్కాంలో పరోక్షంగా కారణం అయిన బాలీవుడ్ తారలపై కూడా ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంస్థ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న బాలీవుడ్‌ తారలు.. Q నెట్‌లో పెట్టుబడలు పెట్టే విధంగా ప్రమోషన్ చేసినట్లు విచారణలో తేలింది. మన దేశంలోనే కాకుండా దుబాయ్, మలేషియాలో కూడా క్యూ నెట్ సంస్థ లో పెట్టుబడులు పెట్టండి అంటూ బాలీవుడ్‌ హీరోలతో ప్రచారం చేయించారు అంటూ భాదితులు సైబరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ నటులు అనీల్ కపూర్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ శ్రాఫ్, యువరాజ్ సింగ్, పూజ హెగ్డేలపై ఐపీసీ 420, 406, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రెండో సారి నోటిసులు ఇచ్చారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Next Story