Top
logo

సైకో వినోద్‌ అరెస్ట్‌..300 మంది యువతుల ఫోటోలు మార్ఫింగ్‌..

సైకో వినోద్‌ అరెస్ట్‌..300 మంది యువతుల ఫోటోలు మార్ఫింగ్‌..
X
Highlights

సోషల్‌ మీడియాలో యువతుల ఫోటోలు సేకరించి మార్ఫింగ్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న సైకో వినోద్‌ను హైదరాబాద్‌...

సోషల్‌ మీడియాలో యువతుల ఫోటోలు సేకరించి మార్ఫింగ్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న సైకో వినోద్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 300 మంది యువతుల ఫోటోలను సేకరించి పోర్న్‌ వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాడు విశాఖకు చెందిన వినోద్‌ కుమార్‌. యువతులను బెదిరించి ఒక్కొక్కరి దగ్గర వేలకు వేలు డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు ఇస్తేనే ఫోటోలు తొలగిస్తామని యువతులతో అసభ్యకరంగా చాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ ‌క్రైమ్‌ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు.

Next Story