ఫార్మసీ విద్యార్థినిపై కాలేజీ డైరెక్టర్ లైంగిక వేధింపులు... కలెక్టర్ కు ఫిర్యాదు ...

ఫార్మసీ విద్యార్థినిపై కాలేజీ డైరెక్టర్ లైంగిక వేధింపులు... కలెక్టర్ కు ఫిర్యాదు ...
x
ఫార్మసీ విద్యార్థినిపై కాలేజీ డైరెక్టర్ లైంగిక వేధింపులు
Highlights

తూర్పుగోదావరి జిల్లాలోని కోరింగ ఫార్మసీ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనపై డైరెక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ ఓ విద్యార్థిని...

తూర్పుగోదావరి జిల్లాలోని కోరింగ ఫార్మసీ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనపై డైరెక్టర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ ఓ విద్యార్థిని జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా కాలేజీలో మరికొందరు విద్యార్థులపైనా దాడులు జరుగుతున్నాయని తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారని అందుకే తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని కోరింగ ఫార్మసీ కాలేజీలో లైంగిక దాడులు జరుగుతున్నాయంటూ అదే కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆరోపించడం కలకలం రేపుతోంది. కాలేజీ డైరెక్టర్ గుండు శ్రీనివాసరావు తనపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆ సమయంలో తాను తప్పించుకుని బయటపడ్డట్లు తెలిపింది. అయితే విషయాన్ని స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారికి ఫిర్యాదు చేశానని వివరించింది. తనతో పాటు మరికొందరు హాస్టల్ విద్యార్థినుల పట్ల కూడా శ్రీనివాసరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన జేసి విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయినా శ్రీనివాసరావుపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదని బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి మరోసారి జేసీని కలిసింది.

ఫిర్యాదు తీసుకుని వారం గడుస్తున్నా శ్రీనివాసరావుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు తన కుంటుంబంతో ఆందోళన చేపట్టింది. వీరి ఆందోళనకు మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దిశ చట్టం ద్వారా 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం శ్రీనివాసరావును ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్లే శ్రీనివాసరావును కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు కాలేజీ హాస్టల్ తన నివాసంపైనే ఏర్పాటు చేశారు శ్రీనివాసరావు. దీంతో హాస్టల్ నిర్వహణపై కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా అధికారులు స్పందించి శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories