Top
logo

చిత్తూరు జిల్లాలో పరువు హత్య నిందితుల అరెస్ట్‌

చిత్తూరు జిల్లాలో పరువు హత్య నిందితుల అరెస్ట్‌
X
Highlights

సంచలనం రేకెత్తించిన పరువు హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు...

సంచలనం రేకెత్తించిన పరువు హత్యకు సంబంధించి ఆరుగురు నిందితులను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసరపెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్నకన్నబిడ్డ హేమలతను దారుణంగా చంపేశారు. అందరూ చూస్తుండగానే కర్కశంగా హత్య చేసిన హేమావతి తల్లిదండ్రులు భాస్కర్ నాయుడు, వరలక్ష్మి, చెల్లలు నిఖిలతో ఇద్దరు మైనర్‌లు అయిన తమ్ముళ్లు, తాత పెద్డబ్బనాయుడులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై మొత్తం 6 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు పలమనేరు డీఎస్పీ వెల్లడించారు. నిందితులను పలమనేరు కోర్టుకు హాజరుపర్చారు. నిబంధనల మేరకు మీడియా సమావేశంలో నిందితులను చూపించలేదని పోలీసులు చెప్పారు.

Next Story