జెరాక్స్ నోట్లు ఇచ్చి.. రూపాయలు కొట్టేశాడు!

జెరాక్స్ నోట్లు ఇచ్చి.. రూపాయలు కొట్టేశాడు!
x
Highlights

ఇదో వెరైటీ దొంగతనం. మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రం టార్గెట్. విదేశీ డబ్బుకు.. మనదేశ రూపాయలను మార్చే క్రమంలో జరిగిన చోరీ. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్...

ఇదో వెరైటీ దొంగతనం. మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రం టార్గెట్. విదేశీ డబ్బుకు.. మనదేశ రూపాయలను మార్చే క్రమంలో జరిగిన చోరీ. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేటలో మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు యూఏఈ కరెన్సీ అయిన దిర్హమ్‌ లిచ్చి రూ.89వేల భారత కరెన్సీ తీసుకున్నాడు. అయితే, ఆ సమయంలో దుకాణ యజమాని పసిగట్టలేక పోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిన తరువాత ఆ నోట్లను పరిశీలించిన యజమాని తాను మోసపోయిన విషయాన్ని తెలుసుకుని లబోదిబో మన్నాడు. ఇంతకీ ఆ దుండగుడు ఇచ్చిన దిర్హాంలు జెరాక్స్ చేసిన కాగితాలు. దీంతో దుకాణ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ నిజామాబాద్‌, కామారెడ్డిలలో ఇటువంటి చోరీలు జరిగినట్లు సమాచారం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories