విజయవాడలో కారు బీభత్సం : బాలుని మృతి

K V D Varma
Published on: 28 July 2019 3:01 PM IST
విజయవాడలో కారు బీభత్సం : బాలుని మృతి
X

విజయవాడ లో ఈరోజు ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. విజయవాడ నగరంలో అయోధ్యానగర్ కరకట్ట వద్ద అతి వేగంగా వస్తున్న కారు ఓ బాలుడిని డీ కొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తరువాత పారిపోయే క్రమంలో రెండు ఆటలను కూడా డీ కొట్టినంత పని చేయడంతో ఆటోలోని ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు.

కారు ఎవరిదీ? ఏమిటీ అనే విషయాలు తెలియరాలేదు. ప్రమాదం వార్త తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయతినిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story