Top
logo

చిక్కడపల్లిలో కిడ్నాప్ కలకలం

చిక్కడపల్లిలో కిడ్నాప్ కలకలం
X
Highlights

చిక్కడపల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేకెత్తించింది. ఆదివారం రాత్రి వ్యాపారి గజేంద్ర ప్రసాద్ ను గుర్తు...

చిక్కడపల్లిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేకెత్తించింది. ఆదివారం రాత్రి వ్యాపారి గజేంద్ర ప్రసాద్ ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం వారు 3 కోట్లు డిమాండ్ చేశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కోటి రూపాయలు కిడ్నాపర్లకు ఇచ్చినట్టు తెలిసింది. కోటి రూపాయలు అందుకున్న అనంతరం గజేంద్ర ప్రసాద్ ను అబిడ్స్ ప్రనతంలో కిడ్నాపర్లు వదిలిపెట్టారు.

కాగా, ఈ వ్యవహారం పై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారి గజేంద్ర ప్రసాద్ కు ముంబాయి వ్యాపార వేత్తలతో లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story